అది 2006 మార్చి 12, జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య వన్డే. అప్పటివరకు 50 ఓవర్ల మ్యాచ్ అంటే మహా అయితే 300 లేదంటే 350 లోపు స్కోరు చేసేవారు. ఇందులో మాత్రం ఇరుజట్ల బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. తొలుత ఆసీస్ భారీ స్కోరు చేయగా, ఆశ్చర్యకర రీతిలో దానిని ఛేదించింది సఫారీ జట్టు. ఇప్పటికీ ఈ మ్యాచ్‌ను క్రికెట్లోని గొప్ప(గ్రేటెస్ట్) వన్డేలో ఒకటిగా పేర్కొన్నారు క్రికెట్ విశ్లేషకులు.
క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేని వన్డేకు 14 ఏళ్లు - cricket news
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేని ఓ వన్డేకు నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ మ్యాచ్ గురించి ఈ కథనం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. గిల్‌క్రిస్ట్ 55, కటిచ్ 79, రికీ పాంటింగ్ 164, మైక్ హస్సీ 81, సైమండ్స్ 27, బ్రెట్‌లీ 9 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం ఛేదన ప్రారంభించిన సఫారీ జట్టులో ఓపెనర్ డిప్పనార్ 1 పరుగుకే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన గిబ్స్(175), మరో ఓపెనర్ స్మిత్(90)తో కలిసి బీభత్సం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 187 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత వచ్చిన వారిలో డివిలియర్స్ 14, కలిస్ 20, బౌచర్ 50, కెంప్ 13, వాన్ డర్ వాత్ 35 పరుగులు చేశారు. మరో బంతి మిగిలుండగానే 9 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి అద్భుత విజయం సాధించారు. వన్డేల్లో సరికొత్త రికార్డు నమోదు చేశారు.