తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​శర్మ '264' మైలురాయికి ఐదేళ్లు

పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు(264) రోహిత్ శర్మదే. ఈ ఘనతకు నేటితో ఐదేళ్లు పూర్తయింది. 2014 నవంబరు 14న తన కెరీర్​లో రెండోసారి ద్విశతకం చేసి ఈ రికార్డు అందుకున్నాడు హిట్​మ్యాన్​.

రోహిత్ శర్మ

By

Published : Nov 13, 2019, 11:17 AM IST

వన్డేల్లో ద్విశతకం ఒక్కసారి కొట్టడమంటేనే వింతగా చూస్తారు. అలాంటిది ఇప్పటికే మూడు ద్విశతకాలు బాదేశాడు రోహిత్ శర్మ. ముఖ్యంగా శ్రీలంకపై చేసిన 264 పరుగులను అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోరు. దీనితో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్​గా నిలిచాడు హిట్​మ్యాన్. ఈ ఘనతకు నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

2014 నవంబరు 14న ఈడెన్​గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో బౌండరీల వరద పారింది. బంతి ఏదైనా స్టాండ్స్​లోకే వెళ్లింది. రోహిత్.. 173 బంతుల్లో 264 పరుగులతో విజృంభించాడు. 33 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే శ్రీలంక అతడిని ఔట్ చేసే అవకాశాన్ని వదులుకొని భారీ మూల్యం చెల్లించుకుంది.

రోహిత్.. తన కెరీర్​లో తొలి డబుల్ సెంచరీని(209) 2013లో ఆస్ట్రేలియాపై చేశాడు. 2017లో లంకేయులపై 207 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.రెండోసారి, మూడోసారి శ్రీలంకపైనే ఈ ఘనత సాధించడం విశేషం.

ఇదీ చదవండి: హాంకాంగ్ ఓపెన్​ నుంచి సైనా, సమీర్ ఔట్

ABOUT THE AUTHOR

...view details