సరిగ్గా 46 ఏళ్ల క్రితం 1975లో ఇదే రోజున భారత హాకీ చరిత్రలో మరిచిపోలేని రోజు. హాకీలో తొలి ప్రపంచకప్ భారత్ గెలుచుకుంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 2-1 తేడాతో గెలిచి.. కప్‌ను కైవసం చేసుకుంది.
భారత హాకీ తొలి ప్రపంచకప్‌కు నేటితో 46 ఏళ్లు - ధ్యాన్‌చంద్
హాకీలో భారత పురుషుల జట్టు తొలి ప్రపంచకప్ గెలుచుకుని నేటికి సరిగ్గా 46 ఏళ్లు అయ్యింది. ఈ విషయాన్ని హాకీ ఇండియా ట్విట్టర్ వేదికగా గుర్తు చేసింది. దాయాది పాకిస్థాన్‌పై ఫైనల్లో 2-1 తేడాతో గెలుపొందింది ఇండియా.
భారత హాకీ తొలి ప్రపంచకప్‌కు నేటితో 46 ఏళ్లు
దిగ్గజ హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ కుమారుడు అశోక్ కుమార్ ఈ మ్యాచ్‌లో చివరి గోల్ సాధించి.. భారత్‌ను గెలిపించాడు. సదరు వరల్డ్‌కప్ జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకుంది హాకీ ఇండియా. "46 ఏళ్ల క్రితం, 1975లో ఇదే రోజున భారత పురుషుల హాకీ జట్టు.. తొలి ప్రపంచకప్‌ను గెలుచుకుంది" అని ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి:విండీస్-లంక వన్డేకు అనుకోని అతిథులు