2016 ఏప్రిల్ 3.. విండీస్ జట్టు రెండోసారి పొట్టి కప్‌ను చేజిక్కించుకున్న రోజు. ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో చివరికి విజయం కరీబియన్ జట్టునే వరించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కొట్టిన వరుస సిక్సర్లకి.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు దిమ్మతిరిగింది. మ్యాచ్ అనంతరం.. "పేరు గుర్తుంచుకోండి, కార్లోస్ బ్రాత్‌వైట్" అంటూ గంభీరమైన గొంతుతో ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించాడు.
చివరి ఓవర్లో కరీబియన్ జట్టుకు 19 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌కు దిగాడు. బ్యాటింగ్‌లో ఉన్న బ్రాత్‌వైట్ వరుసగా 4 బంతుల్లో 4 సిక్సర్లు కొట్టి తమ జట్టుకు రెండో టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అంతకుముందు 2012లో తొలిసారి పొట్టి కప్‌ను అందుకుంది కరీబియన్ జట్టు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు బ్రాత్‌వైట్. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసుకున్న అతడు బ్యాటింగ్‌లో 34 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు.