తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా ఐపీఎల్​ అరంగేట్రానికి ఎనిమిదేళ్లు - ఐపీఎల్

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున టీమ్​ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్​లో తొలి వికెట్​గా విరాట్ కోహ్లీని ఔట్​ చేసిన బుమ్రా.. వందో వికెట్​గానూ కోహ్లీనే పెవిలియన్​ చేర్చడం విశేషం.

On this day in 2013, Bumrah made his IPL debut with Mumbai Indians
ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున బుమ్రా ఐపీఎల్ అరంగేట్రం

By

Published : Apr 4, 2021, 12:43 PM IST

2013లో సరిగ్గా ఇదే రోజు పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా.. ముంబయి ఇండియన్స్​ తరఫున ఐపీఎల్​లో అరంగేట్రం చేశాడు. బెంగుళూరుతో తొలి మ్యాచ్​ ఆడిన అతడు మొదటి వికెట్​గా విరాట్​ కోహ్లీని ఔట్​ చేశాడు. గతేడాది తాను తీసుకున్న 100వ వికెట్​ కూడా కోహ్లీదే కావడం విశేషం.

ప్రారంభ సీజన్​లో కేవలం రెండు మ్యాచ్​లే ఆడిన బుమ్రా.. 3 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 92 ఐపీఎల్ మ్యాచ్​లాడి 109 వికెట్లు పడగొట్టాడు. 4/14 ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

ఐపీఎల్​ అరంగేట్రం తర్వాత మూడేళ్లకు టీమ్​ఇండియాకు ఎంపికైన ఈ యువ పేసర్​.. ఆసీస్​తో తొలి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు. ఇప్పటివరకు 67 వన్డేలతో పాటు 50 టీ20లు, 19 టెస్టుల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఐపీఎల్​తో ముంబయి జట్టుకే కాక టీమ్​ఇండియాకు కీలక బౌలర్​గా మారాడు.

ఇదీ చదవండి:ఆ ఆటగాళ్ల ఆరంభం అదిరింది

ABOUT THE AUTHOR

...view details