సరిగా 16 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించాడు. విశాఖ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో మహి మూడంకెల స్కోరు అందుకున్నాడు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే సచిన్ వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా.. ఫస్ట్ డౌన్లో ధోనీని బ్యాటింగ్‌కు దింపింది. సెహ్వాగ్‌తో కలిసి 96 పరుగులు జోడించాడు మహీ. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వీరూ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ద్రవిడ్‌తో జతకట్టిన ఈ ఝార్ఖండ్ డైనమైట్.. మూడో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇదీ చదవండి:లుకేమియాను జయించి.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి
అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం బాదిన ధోనీ.. 15 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 123 బంతుల్లోనే 148 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత్ 9 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ప్రత్యర్థిని 298 పరుగులకే కట్టడి చేసింది.
మొత్తం సుదీర్ఘ కెరీర్లో 350 వన్డేలు ఆడిన మహి.. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు సారథిగా వ్యవహరించాడు. ఐసీసీ మేజర్ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ అతడే కావడం విశేషం. ఐపీఎల్లో చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ.. మూడు సార్లు టైటిల్‌ను అందించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు.
ఇదీ చదవండి:నిలకడైన ఆటతో.. రైజర్స్ రైట్ రైట్