తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్​లకు నోటీసులు - IPL

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్​లకు బీసీసీఐ నోటీసులిచ్చింది.  క్రికెట్ సలహా మండలిలో ఉంటూ, ఐపీఎల్​లో మెంటార్స్​గా వ్యవహరిస్తున్నందుకు గానూ ఏప్రిల్ 28లోపు రాతపూర్వక సమాధానమివ్వాలని స్పష్టం చేసింది.

సచిన్ తెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్​లకు నోటీసులు

By

Published : Apr 25, 2019, 6:44 AM IST

టీమిండియా మాజీ క్రికెటర్స్ సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్​లకు బీసీసీఐ నోటీసులు అందించింది. క్రికెట్ సలహా మండలిలో సభ్యులుగా ఉంటూ ఐపీఎల్​లో మెంటార్స్​గా పనిచేయడంపై బీసీసీఐ ఆగ్రహాం వ్యక్తం చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంతో వీరికి నోటీసులిచ్చారు అంబుడ్స్​మెన్. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్​కు చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.

సచిన్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకు, లక్ష్మణ్ సన్​రైజర్స్​కు మెంటార్స్​గా వ్యవహరిస్తున్నారు. వీరికే కాకుండా గంగూలీకి గతంలో నోటీసులు అందాయి. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, క్రికెట్ సలహా మండలిలో సభ్యుడిగా, ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు మెంటార్​గా వ్యవహరిస్తున్నాడీ మాజీ టీమిండియా కెప్టెన్.

"గంగూలీకి నోటీసు అందింది. దీంతోపాటు సచిన్​, లక్ష్మణ్​కూ నోటీసులందాయి. కానీ వీరిలో మెంటార్​గా, సలహా మండలిలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నందుకు గానూ సచిన్ ఎటువంటి డబ్బు తీసుకోవడం లేదు. స్వచ్ఛందంగానే సేవలు అందిస్తున్నారు" - బీసీసీఐ

ఏప్రిల్ 28 లోపు రాత పూర్వక సమాధానాన్ని తెలిపాలని జస్టిస్ జైన్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details