తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్ ఫైనల్లో మహిళల హాకీ జట్టు - final

జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్​లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్​కు చేరింది. సెమీస్​లో చైనాతో జరిగిన మ్యాచ్​ 0-0తో డ్రాగా ముగిసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ తుదిపోరుకు అర్హత సాధించింది.

మహిళల హాకీ జట్టు

By

Published : Aug 21, 2019, 10:43 AM IST

Updated : Sep 27, 2019, 6:15 PM IST

ఒలింపిక్​ టెస్ట్​ ఈవెంట్​లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. సెమీస్​లో చైనాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తుదిపోరుకు అర్హత సాధించింది. నేడు జరగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు జపాన్​తో భారత అమ్మాయిలు తలపడనున్నారు.

ఆరంభంలో మంచి స్థితిలో ఉన్న టీమిండియా అనంతరం ఒత్తిడికి లోనైంది. వెంటనే పుంజుకుని చైనీస్ డిఫెన్స్​పై ఒత్తిడి పెంచింది. రెండో క్వార్టర్​లో ఎటాకింగ్​ చేసిన భారత అమ్మాయిలు 17వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. గుర్జీత్ ప్రయత్నించినప్పటికీ ప్రతర్థి జట్టు అవకాశమివ్వలేదు.

మహిళల హాకీ జట్టు

చివర్లో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆట రెండు నిమిషాల్లో ముగుస్తుందనుకున్న తరుణంలో చైనాకు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే భారత ఢిఫెన్స్​ను ఛేదించలేకపోయింది డ్రాగన్ జట్టు. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో గోల్ నమోదు కాకుండానే డ్రాగా ముగిసింది.

ఇప్పటికే పురుషుల హాకీ జట్టు ఫైనల్​ చేరింది. మంగళవారం జపాన్​తో జరిగిన మ్యాచ్​లో 6-3 తేడాతో గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్​పై తలపడనుంది.

ఇది చదవండి: హాకీ: జపాన్​పై విజయం.. ఫైనల్​కు భారత్

Last Updated : Sep 27, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details