మరో రంజీ ఆటగాడి సెంచరీ! బ్యాటుతో కాదు వయసులో! వందేళ్లు బతికిన రంజీ ఆటగాళ్ల జాబితాలో రఘునాథ్ చంతోర్కర్ చేరారు. శనివారం ఆయన శతసంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1943-44 నుంచి 1946-47 మధ్య మహారాష్ట్ర తరఫున, 1950-51 సీజన్లో ముంబయి తరఫున రఘునాథ్ రంజీ మ్యాచ్‌లు ఆడారు.
7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 155 పరుగులు చేసి.. 2 వికెట్లు పడగొట్టారు. దినకర్ దేవ్‌ధర్(1892-1993), వసంత్ రాయ్‌జీ(1920-2020) తర్వాత వందేళ్లు బతికిన మూడో రంజీ ఆటగాడాయన. ఈ ఏడాది జనవరిలో వందో ఏడాదిలోకి అడుగుపెట్టిన వసంత్ రాయ్‌జీ.. జాన్‌లో కన్నుమూశారు.
వందో వసంతంలోకి మరో రంజీ ఆటగాడు - వందో వసంతంలోకి రంజీ ఆటగాడు
వందేళ్లు బతికిన రంజీ ఆటగాళ్ల జాబితాలో మరో ఆటగాడు చేరాడు. నవంబర్ 21(శనివారం)న రఘునాథ్ చంతోర్కర్ శతవసంతంలోకి అడుగుపెట్టారు.
రఘునాథ్ చంతోర్కర్
ఇదీ చూడండి :'కోహ్లీ సంతానాన్ని ఆస్ట్రేలియన్‌గా పరిగణిస్తాం'