తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రాయుడు...నీ బాధను అర్థం చేసుకోగలను'

ప్రపంచకప్​లో తెలుగు ఆటగాడు అంబటి రాయుడుని ఎంపిక చేయకపోవడంపై మరో హైదరాబాదీ క్రికెటర్​ ప్రజ్ఞాన్​ ఓజా స్పందించాడు.

'రాయుడు...నీ బాధను అర్థం చేసుకోగలను'

By

Published : Apr 19, 2019, 7:22 PM IST

అంతర్జాతీయ క్రికెట్​లో తెలుగు క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని.. గతంలో లక్ష్మణ్​, తాజాగా రాయుడుకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా సైతం రాయుడు బాధను అర్థం చేసుకోగలను అంటూ ట్వీట్‌ చేయటం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.

"హైదరాబాదీ క్రికెటర్ల పరిస్థితి ఇంతే. ఇలాంటి గడ్డు కాలాన్ని నేనూ ఎదుర్కొన్నా. నీ బాధను అర్థం చేసుకోగలను" అంటూ రాయుడుకు మద్దతుగా ట్వీట్​ చేశాడు ఓజా.

రాయుడు కంటే విజయ్‌ శంకర్​ 3 రకాలుగా ఉపయోగపడతాడంటూ ఎమ్మెస్కే చేసిన ట్వీట్​కు అంబటి వ్యంగ్యంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌పై బీసీసీఐ స్పందిస్తూ.. రాయుడు బాధను అర్థం చేసుకోగలమని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపింది. అయితే తాజాగా ఓజా.. ఇది అంబటి ఒక్కడిదే కాదు తెలుగు ఆటగాళ్ల పరిస్థితి ఇంతే అంటూ ట్వీట్​ చేయడం చర్చనీయాంశమైంది.

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన ఓజాకు.. టెస్ట్‌ కెరీర్​లో మంచి రికార్డు ఉంది. అయితే.. భారత జట్టు తరఫున సుదీర్ఘ కాలం ఆడలేకపోయాడీ హైదరాబాదీ క్రికెటర్​. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఓజా సెలక్షన్‌ ప్యానెల్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. సచిన్ ఆడిన​ చివరి (200వ) టెస్టు మ్యాచ్​లో ఓజా 10 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు. మొత్తం 24 టెస్టుల్లో 113 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details