తెలంగాణ

telangana

ETV Bharat / sports

"టీ20 ప్రపంచకప్​ గెలుపే ప్రధాన లక్ష్యం" - టీ-20 ప్రపంచకప్​ 2020

కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసించాడు కోచ్​ రవిశాస్తి. రానున్న రోజుల్లో భారత్​ సాధించాల్సిన లక్ష్యాల గురించి వివరించాడు.

ODIs this year could be used for World T20 preparation: Shastri
"టీ20 ప్రపంచకప్​ సాధించటమే మా ప్రధానలక్ష్యం"

By

Published : Jan 22, 2020, 9:29 PM IST

Updated : Feb 18, 2020, 1:16 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో తీవ్ర ఒత్తిడిలోనూ టీమిండియా అద్భుతంగా ఆడిందని కితాబిచ్చాడు కోచ్​ రవిశాస్తి. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్​ సాధించాలన్నదే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు.

"టాస్​ గెలిచినా, ఓడినా.. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ సత్తా చూపిస్తున్నాం. జట్టును విజయతీరాలకు చేర్చటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్​లో జరిగే టీ20 ప్రపంచకప్​ సాధించడానికీ అంతే పట్టుదలతో పనిచేస్తాం. 'నా' అనే పదానికి బదులుగా 'మన' అనే పదాన్ని అనుసరిస్తాం. అందుకే టీమిండియా విజయాన్ని అందరం కలసి వేడుకలా జరుపుకొంటాం. ఆటగాళ్లు ఒత్తిడిని జయించడం వల్లే ఆసీస్​తో తొలి వన్డే ఓడినా.. మిగతా రెండింటిలో గెలిచి సిరీసే గెలిచాం."
- రవిశాస్త్రి,
టీమిండియా కోచ్​

పొట్టి ప్రపంచకప్​ అందుకోవడానికి న్యూజిలాండ్​, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్​లు మంచి వేదికలని అభిప్రాయపడ్డాడు రవిశాస్త్రి. జట్టులో సీనియర్​ ఆటగాళ్లు గాయల బారిన పడటం బాధించినా.. వారి స్థానంలో వచ్చిన యువకులు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ధావన్​ గాయంతో జట్టుకు దూరమవడం కాస్త నిరాశపర్చిందని అన్నాడు శాస్త్రి.

జనవరి 24 నుంచి న్యూజిలాండ్​పై అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది కోహ్లీసేన. మార్చిలో దక్షిణాఫ్రికాతోనూ అమీతుమీ తేల్చుకోనుంది.

ఇదీ చూడండి.. న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టిదే

Last Updated : Feb 18, 2020, 1:16 AM IST

ABOUT THE AUTHOR

...view details