న్యూజిలాండ్ తరఫున టెస్టులాడిన వృద్ధ క్రికెటర్ జాన్ రైడ్(92) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. 50-60వ దశకంలో కివీస్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా జాన్ గుర్తింపు తెచ్చుకున్నారు.
న్యూజిలాండ్ వృద్ధ క్రికెటర్ జాన్ మృతి - వృద్ధ క్రికెటర్ జాన్ రైడ్
న్యూజిలాండ్ టెస్టు మాజీ క్రికెటర్ జాన్ రైడ్ తుదిశ్వాస విడిచారు. దాదాపు 16 ఏళ్ల పాటు కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
న్యూజిలాండ్ వృద్ధ క్రికెటర్ జాన్ మృతి
ఆక్లాండ్‌లో జన్మించిన రైడ్.. 246 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 16,128 పరుగులు చేశారు. ఇందులో 39 శతకాలతో పాటు 466 వికెట్లు తీశారు.
1949లో టెస్టు అరంగేట్రం చేసిన జాన్.. 58 మ్యాచ్‌లాడి 3428 పరుగులు చేయడం సహా 85 వికెట్లు పడగొట్టారు. 1965లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈయన.. అనంతరం న్యూజిలాండ్ సెలెక్టర్‌గా, మేనేజర్‌గా, ఐసీసీ మ్యాచ్ రిఫరీగా సేవలందించారు.