తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫిలిప్స్ ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండో టీ20లో కివీస్​దే గెలుపు - Glenn Phillips latest news

మౌంట్​ మాంగనూయ్ వేదికగా జరిగిన టీ20లో విండీస్​పై కివీస్ గెలిచింది. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్ క్రికెటర్​ ఫిలిప్స్ వేగవంతమైన శతకం కొట్టాడు.​

new zealand beat west indies by 72 runs
వెస్టిండీస్​పై న్యూజిలాండ్ విజయం

By

Published : Nov 29, 2020, 12:11 PM IST

Updated : Nov 29, 2020, 1:01 PM IST

రెండో టీ20లోనూ న్యూజిలాండ్​ ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్​తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో ఆల్​రౌండర్​ ప్రదర్శనతో కివీస్ అదరగొట్టింది. ఫలితంగా 72 పరుగుల తేడాతో గెలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్​ ఓపెనర్లు గప్తిల్(34), సెఫార్ట్(18)​.. ధాటిగానే ఇన్నింగ్స్​ ప్రారంభించారు. దీంతో తొలి వికెట్​కు 49 పరుగులు జోడించారు. అనంతరం తక్కువ పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ ఔటయ్యారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కాన్వే(65*), గ్లెన్ ఫిలిప్స్(51 బంతుల్లో 108)​ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు చేసింది కివీస్.

న్యూజిలాండ్ యువ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్

ఛేదనలో విండీస్​ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే చేయగలిగింది. కెప్టెన్ పొలార్డ్(28) టాప్ స్కోరర్.

వేగవంతమైన సెంచరీ

46 బంతుల్లో సెంచరీ చేసిన ఫిలిప్స్.. తమ దేశం తరఫున అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతడి తర్వాతి స్థానంలో కొలిన్ మున్రో(47 బంతుల్లో) ఉన్నాడు.

మూడో అత్యధిక స్కోరు

నిర్ణీత 20 ఓవర్లలో 238 పరుగులు చేసిన న్యూజిలాండ్.. ఈ ఫార్మాట్​లో ఈ జట్టుకిది మూడో అత్యధికం.

Last Updated : Nov 29, 2020, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details