న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తదుపరి రెండు టీ20 మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతి నిషేధించింది కివీస్ క్రికెట్ బోర్డు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరోసారి అధికమవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య జరగనున్న తొలి రెండు టీ20లకు కూడా అభిమానులను రావొద్దని కోరింది.
ఈ మ్యాచ్‌లు ఆక్లాండ్‌లో జరగాల్సి ఉండగా.. వాటి వేదికను వెల్లింగ్టన్కు మార్చింది బోర్డు. ఐదో టీ20, మహిళల మూడో టీ20కి సంబంధించి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.