ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన చివరి మూడు మ్యాచ్‌ల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. వెల్లింగ్టన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని కివీస్ బోర్డు వెల్లడించింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌ను అభిమానులు లేకుండానే.. వెల్లింగ్టన్లోనే జరపనున్నట్లు బోర్డు ప్రకటించింది.
ఇది చదవండి:రోహిత్ సిక్స్‌ల రికార్డ్ బ్రేక్ చేసిన గప్టిల్
సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టీ20లు గెలిచి ఊపు మీదుంది న్యూజిలాండ్. మార్చి 3న జరిగే మూడో టీ20లోనూ గెలిచి, సిరీస్ సొంతం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.