స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను 3-2 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వెల్లింగ్టన్లో జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది కివీస్.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసింది. వేడ్(29 బంతుల్లో 44), కెప్టెన్ ఫించ్ (32 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించారు. ఇష్ సోథి 3, సౌథీ 2, బౌల్ట్ 2 వికెట్లతో ఫించ్ సేనను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.