తెలంగాణ

telangana

ETV Bharat / sports

'న్యూజిలాండ్​నూ విజేతగా ప్రకటిస్తే బాగుండేది' - 2019 ప్రపంచకప్​ న్యూస్​

ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను సంయుక్త విశ్వ విజేతగా ప్రకటించాల్సిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​లో కివీస్‌ అత్యంత నిలకడగా ఆడిందని వెల్లడించాడు.

NZ should have been joint winners of 2019 World Cup: Gambhir
'ఇంగ్లాండ్​తో పాటు న్యూజిలాండ్​​ విశ్వవిజేతే!'

By

Published : May 13, 2020, 3:06 PM IST

ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి సమరం అభిమానులను మునికాళ్లపై నిలబెట్టింది. ఉత్కంఠంతో ఊపేసింది. మ్యాచ్‌లోనే కాకుండా సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమం అయ్యాయి. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత ఐసీసీ విధానంపై క్రికెటర్లు సహా అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఇదే విషయంపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్ స్పందించాడు.

"గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో రెండు జట్లనూ విజేతగా ప్రకటిస్తే బాగుండేది. న్యూజిలాండ్‌కు ప్రపంచ ఛాంపియన్లు అన్న పేరు దక్కాల్సింది. కానీ దురదృష్టం వెంటాడింది" అని గంభీర్‌ అన్నాడు. మెగా టోర్నీల్లో కివీస్‌ అత్యంత నిలకడగా రాణిస్తోందని అతడు పేర్కొన్నాడు. వారి అర్హతకు తగిన పేరు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

నిలకడగా విజయాలు

"కివీస్‌ రికార్డును పరిశీలిస్తే వారి ప్రదర్శన అత్యంత నిలకడగా ఉంది. ఈ ప్రపంచకప్‌, అంతకు ముందు ప్రపంచకప్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది. అన్ని దేశాలు, భిన్న పరిస్థితుల్లోనూ పోటీనివ్వగల సామర్థ్యం వారికుంది. వారికివ్వాల్సిన ఘనతను మనం ఇవ్వలేదు" అని గంభీర్‌ అన్నాడు.

ఇదీ చూడండి.. మహిళల క్రికెట్​ జట్టు మాజీ కోచ్​కు కరోనా

ABOUT THE AUTHOR

...view details