తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రేయస్, రాహుల్ దూకుడు.. కివీస్​పై భారత్ విజయం - IND vs NZ t20

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టీ20లో భారత్ ఉత్కంఠకర​ విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని, 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

మ్యాచ్
మ్యాచ్

By

Published : Jan 24, 2020, 3:58 PM IST

Updated : Feb 18, 2020, 6:11 AM IST

ఆక్లాండ్​ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 తేడాతో ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని, 19 ఓవర్లలోనే ఛేదించి, ఐదు టీ20ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రారంభం నుంచి దాటిగానే ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే ఔటైనా.. కోహ్లీ, రాహుల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 56 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత కోహ్లీ.. 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శివం దూబే (13) నిరాశపర్చాడు. ఫలితంగా మ్యాచ్​ అదుపుతప్పింది. కానీ యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు నిలిచి, ఒంటి చేత్తో మ్యాచ్​ను గెలిపించాడు.

భళా శ్రేయస్

ఛేదనలో 142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్. ప్రధాన బ్యాట్స్​మెన్ ఔటయ్యారు. యువ బ్యాట్స్​మెన్ శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండేలపై భారం పడింది. మనీశ్ మాత్రం శ్రేయస్​కు స్ట్రైకింగ్ ఇస్తూ 14 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. కానీ శ్రేయస్ ఆటతీరు మాత్రం అద్భుతం. తీవ్ర ఒత్తిడిలోనూ భారీ షాట్లు ఆడూతూ జట్టును ఆదుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగుల చేశాడు. ఫలితంగా టీమిండియా 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

కివీస్ ధనాధన్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభానిచ్చారు. తొలి వికెట్​కు మున్రో-గప్తిల్.. 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం గప్తిల్​ (30) పెవిలియన్ చేరాడు. బౌండరీ లైన్​ వద్ద రోహిత్ పట్టిన ఇతడి క్యాచ్​ మ్యాచ్​కే హైలెట్​గా నిలిచింది. మున్రో మాత్రం ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. గ్రాండ్​హోమ్ (0) వెంటనే వెనుదిరిగాడు.

అనంతరం సారథి విలియమ్సన్, టేలర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో విలియమ్సన్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 51 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్​లో ఔటయ్యాడు. టేలర్​ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 54 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, దూబే, ఠాకుర్, జడేజా తలో వికెట్ తీశారు.

Last Updated : Feb 18, 2020, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details