తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమిండియా కెప్టెన్​ బాధ్యతే ఉన్నతమైనది'

బీసీసీఐ అధ్యక్షుడి పదవి తనకు చాలా పెద్ద బాధ్యతని చెప్పాడు మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ. అయితే టీమిండియా కెప్టెన్​గా ఉండడమే అత్యున్నతమైనదని అన్నాడు.

గంగూలీ

By

Published : Oct 14, 2019, 12:25 PM IST

Updated : Oct 14, 2019, 1:28 PM IST

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీనే బాధ్యతలు తీసుకుంటున్నట్లు దాదాపు ఖరారైంది . అయితే తుది ఫలితం కోసం సోమవారం మధ్యాహ్నం 3 గంటలు వరకు ఎదురు చూడాలని చెప్పాడు దాదా. అయితే ఇది చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నాడు.

"ఇదో గొప్ప అవకాశంగా భావిస్తా. సవాల్​గా తీసుకుని పని చేస్తా. ఇది చాలా పెద్ద బాధ్యత. దేశవాళీ క్రికెటర్లకే నా మొదటి ప్రాధాన్యత ఇస్తా. ముఖ్యంగా రంజీలపై దృష్టి పెడతా. ఆర్థికంగా ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తా" -సౌరభ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్

అయితే ఈ రెండింటిలో టీమిండియా సారథిగా ఉండడమే పెద్ద బాధ్యతని చెప్పాడు గంగూలీ.

"ఎన్ని పదవులున్నా.. టీమిండియా కెప్టెన్​గా ఉండటమే ఉన్నతంగా భావిస్తున్నా. బీసీసీఐ అధ్యక్షుడవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ పదవి స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా" -సౌరభ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్.

అధ్యక్ష పదవికి మాజీ ఆటగాడు బ్రిజేష్​ పటేల్​ పేరు వినిపించినప్పటికీ సౌరభ్​కే పగ్గాలు దక్కనున్నాయి. బోర్డు కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా... కోశాధికారిగా అరుణ్​ ధూమల్ బాధ్యతలు ​ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ!

Last Updated : Oct 14, 2019, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details