టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ గొప్ప ఆఫ్ స్పిన్నర్ అని, అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అత్యుత్తమని ఆ దేశ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ తరఫున 123 వన్డేలు, 7 టెస్టులు ఆడిన హాగ్.. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శనివారం సమాధానమిచ్చాడు.
"గత ఏడాది నుంచి అశ్విన్ కంటే ఉత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లైయన్ నిలుస్తున్నాడు. అయితే ఇద్దరూ గొప్ప బౌలర్లే. తమ ఆటతీరుపై సంతృప్తి చెందకుండా బౌలింగ్‌లో మరింత మెరుగువ్వాలని ప్రయత్నిస్తుంటారు" అని హాగ్ చెప్పుకొచ్చాడు.