తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలవాటు పడ్డ  ప్రాణం.. అంత తొందరగా వదలలేం' - బ్రెట్​ లీ

కరోనా నేపథ్యంలో బంతి మెరుపుకోసం లాలాజలాన్ని వాడటం నిషేధిస్తూ తాజాగా కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది ఐసీసీ. అయితే ఈ నిబంధనలను అమలు చేయడం కష్టతరమని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్​లీ. కొన్నేళ్ల నుంచి వస్తోన్న అలవాటు ఇప్పటికిప్పుడే వదిలేయమంటే ఆటగాళ్లకు కాస్త కఠినంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Non-usage of saliva on balls will be hard to implement, feels Lee
'బంతిపై లాలాజలాన్ని వాడకుండా ఉండటం కష్టమే!'

By

Published : May 23, 2020, 4:32 PM IST

కరోనా నేపథ్యంలో బంతికి మెరుపు తెప్పించడానికి లాలాజలం వాడటాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధించింది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్​ బ్రెట్​లీ స్పందించాడు. ఈ నిబంధనల్ని అమలు చేయడం చాలా కష్టతరమైన పని అని అంటున్నాడు. అనిల్​ కుంబ్లే అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఐసీసీ క్రికెట్​ కమిటీ సమావేశంలో కొన్ని మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. క్రికెటర్లు పాటించాల్సిన నియమాలతో పాటు బంతికి లాలాజలాన్ని రాయడానన్ని నిషేధిస్తూ కొత్త నిబంధనలను జారీ చేసింది ఐసీసీ.

"బౌలర్లు కొన్నేళ్లుగా పాటిస్తున్న బంతిని మెరుపు తెప్పించే టెక్నిక్​లు.. ఇప్పటికిప్పుడు మానేయండి అంటే కుదురకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాటును ఎవరూ తొందరగా మానలేరు. అందువల్ల దానికి కొంత సమయం పట్టొచ్చు. ఏది ఏమైనా ఇదో గొప్ప నిర్ణయం. కాకపోతే అమలు చేయడమనేది కొంత కష్టతరం కావొచ్చు".

-బ్రెట్​లీ, ఆస్ట్రేలియా మాజీ బౌలర్​

బ్రెట్​లీ వ్యాఖ్యలకు దక్షిణాఫ్రికా క్రికెటర్​ డుప్లెసిస్ మద్దతిచ్చాడు. బౌలర్లే కాకుండా ఫీల్డర్స్​ దీనికి బాగా అలవాటు పడ్డారని తెలిపాడు. ఫీల్డర్​గా తాను బంతిని అందుకునే ముందు లాలాజలాన్ని అరచేతులకు రాసుకుంటానని వెల్లడించాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ రికీ పాంటింగ్​ కూడా తరచుగా లాలాజలాన్ని వాడే వాడని గుర్తుకు చేశాడు డుప్లెసిస్​. ఈ విషయంపై టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ స్పందిస్తూ.. అలవాటు పడిన పనిని వదిలేయాలంటే కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చూడండి...'టిక్​టాక్​లో డ్యూయెట్​ చేద్దామా కోహ్లీ'

ABOUT THE AUTHOR

...view details