తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్రికెటర్ల శిక్షణా శిబిరాలపై త్వరలోనే నిర్ణయం' - టీమ్​ఇండియా

కరోనా లాక్​డౌన్​ను మే 31 వరకు పొడిగిస్తూ ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. ప్రేక్షకులు లేకుండా స్టేడియాల్లో క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది . అయితే దీనిపై సుదీర్ఘ అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది.

No training camp for contracted players but plan to resume skill-based practice at local level: BCCI
'క్రికెటర్ల శిక్షణా శిబిరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం'

By

Published : May 18, 2020, 3:01 PM IST

కాంట్రాక్టు​ క్రికెటర్లకు శిక్షణా శిబిరాలను నిర్వహించడానికి భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరింత సమయం తీసుకోనుంది. లాక్​డౌన్​ నాల్గొవ దశలో కేంద్రం జారీ చేసిన మార్గనిర్దేశకాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్​లు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆటగాళ్లకు వ్యక్తిగత శిక్షణ ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటోంది.

"మే 31 వరకు విమాన ప్రయాణంపై ఉన్న ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని.. కాంట్రాక్ట్ ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి మరికొంత సమయం వేచి చూస్తాం. క్రికెట్​ కార్యకలాపాలన్నీ ప్రారంభించే ముందు కేంద్రం జారీ చేసిన నిబంధనలను అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వస్తాం".

--అరుణ్​ ధుమాల్​, బీసీసీఐ కోశాధికారి

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మూడు వేల మరణాలు సంభవించగా.. 95 వేల మందికి పైగా వైరస్​ ప్రభావితులు ఉన్నారు.

ఇదీ చూడండి..'నేను ఫిట్​గా తయారవ్వడానికి కారణం అతడే'

ABOUT THE AUTHOR

...view details