భారత్, పాక్ మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని.. భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ తెలిపారు. ఇరుజట్లు ఐసీసీ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయని.. కచ్చితంగా జూన్16న మాంచెస్టర్‌లో మ్యాచ్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు.
- పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడలేమని, ఎందుకంటే ఈ మ్యాచ్‌లో తమ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఐసీసీ ఎదుట బీసీసీఐ ప్రశ్నలు లేవనెత్తింది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ ప్రపంచకప్ మ్యాచ్‌లకు పటిష్ఠ భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది.
- తాజాగా న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి తర్వాత ఆటగాళ్లు, అభిమానులకు భద్రత విషయంలో అనుమానాలు తలెత్తాయి.
న్యూజిలాండ్ మసీదు దాడిలో క్షతగాత్రులను తరలిస్తున్న సిబ్బంది ఇటీవల జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి కారణంగా.. పాక్‌తో 2019 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ అభిమానుల నుంచి ఒత్తిడి వచ్చింది. - ఐసీసీ ఈవెంట్లలో సంతకం చేసిన సభ్యులు కచ్చితంగా టోర్నమెంటులో ఆడాల్సిందే. దీన్ని ఎవరు ఉల్లఘించినా ఆ మ్యాచ్ పాయింట్లను ప్రత్యర్థి జట్టుకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు రిచర్డ్సన్.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో ఆర్మీ క్యాప్లతో టీమిండియా బరిలోకి దిగింది. ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళిగా ఈ చర్య తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే పాక్ సైతం వచ్చే మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లతో ఆడతామని.. భారత్ ప్రవర్తనపై చర్యలు తీసకోవాలని ఐసీసీని కోరింది. కానీ అనుమతితోనే టోపీలు ధరించినట్లు ఐసీసీ స్పష్టం చేసినందున వివాదం సద్దుమణిగింది. ఇదంతా బాధిత కుటుంబాలకు విరాళాలు అందించేందుకు చేశారని రాజకీయం కోణం లేదని స్పష్టత ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.