తెలంగాణ

telangana

ETV Bharat / sports

'శ్రీలంకలో ఐపీఎల్​ నిర్వహించాలనే చర్చ జరగలేదు' - షమ్మీ సిల్వ

ప్రపంచమంతా కరోనాపై పోరు సాగిస్తుంటే.. ఈ సమయంలో ఐపీఎల్​ నిర్వహించాలన్న శ్రీలంక క్రికెట్​ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ప్రతిపాదనకు అర్థంలేదని బీసీసీఐ సీనియర్​ అధికారి అభిప్రాయపడ్డారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రతిపాదన కానీ, చర్చ కానీ జరగలేదన్నారు.

No point discussing IPL in Sri Lanka right now, top BCCI official
'శ్రీలంకలో ఐపీఎల్​ నిర్వహించాలనే చర్చ జరగలేదు'

By

Published : Apr 17, 2020, 4:09 PM IST

Updated : Apr 17, 2020, 6:33 PM IST

ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న పరిస్థితుల్లో ఐపీఎల్​ను శ్రీలంకలో నిర్వహించాలనే ప్రతిపాదనపై చర్చించడం అర్థంలేని విషయమని బీసీసీఐ సీనియర్​ అధికారి అన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​) 13వ సీజన్​ నిరవధిక వాయిదా పడింది. అయితే ఈ లీగ్​ను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ తాజాగా ప్రకటించారు. దీనిపై బీసీసీఐ సీనియర్​ అధికారి స్పందించారు.

"ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న సమయంలో ఇలాంటి వాటిపై చర్చించలేం. శ్రీలంక క్రికెట్​ బోర్డు నుంచి దీనిపై ఇంకా అధికార ప్రతిపాదన రాలేదు. ఒకవేళ టోర్నీ నిర్వహించాలనుకుంటే శ్రీలంకలోనే కాకుండా మరికొన్ని దేశాలు ఆతిథ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయి."

-బీసీసీఐ సీనియర్​ అధికారి

ఐపీఎల్-2020 వాయిదా పడటం ఇది రెండోసారి. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీని మొదట ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. కానీ కరోనా ప్రభావం దృష్టిలో ఉంచుకుని లాక్​డౌన్​ను రెండోసారి పొడిగించిన నేపథ్యంలో.. మరోసారి ఈ మెగాటోర్నీ నిరవధిక వాయిదా పడింది. పరిస్థితులు మెరుగయ్యాక లీగ్ నిర్వహణపై ఓ స్పష్టత ఇస్తామని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది.

ఇదీ చూడండి.. ఐపీఎల్ నిర్వహణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసక్తి

Last Updated : Apr 17, 2020, 6:33 PM IST

ABOUT THE AUTHOR

...view details