తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ జట్టులో ధోనీకి దక్కని చోటు! - విరాట్​ కోహ్లీ

సఫారీ మాజీ క్రికెటర్​ జేపీ డుమిని రూపొందిన ఆల్​టైమ్ ఐపీఎల్ ఎలెవన్​లో చెన్నె సూపర్​కింగ్స్ ఆటగాళ్లయిన ధోనీ, రైనాలకు చోటు కల్పించలేదు.​

No place for Dhoni, Duminy names Virat Kohli captain of his all-time IPL XI
ఆ ఐపీఎల్​ జట్టులో ధోనిని ఎంపిక చేయలేదు

By

Published : May 30, 2020, 1:30 PM IST

Updated : May 30, 2020, 3:56 PM IST

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా ఈవెంట్లు కొన్ని రద్దవగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన పలువురు క్రికెటర్లు.. ఉత్తమ ఆటగాళ్లతో కూడిన​ జట్లను తయారు చేస్తున్నారు. ఇదే తరహాలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్​ జేపీ డుమిని, ఆల్​టైమ్ ఐపీఎల్ ఎలెవన్ను ఎంపిక చేశాడు. అయితే ఇందులో చెన్నె సూపర్​కింగ్స్ కెప్టెన్​​ ధోనీతో పాటు సురేశ్​ రైనాలకు స్థానం కల్పించలేదు.

తాను ప్రకటించిన జట్టులో విదేశీ ఆటగాళ్ల ఎంపిక విధానంలోని రూల్​ను పాటించలేదు. భారత్​కు చెందిన కేవలం ఇద్దరు క్రికెటర్లను మాత్రమే ఎంపిక చేశాడు డుమిని. క్రిస్​ గేల్​ను ఓపెనర్​గా​, 2009లో డెక్కన్​ ఛార్జర్స్​కు కెప్టెన్​గా వ్యవహరించిన​ గిల్​క్రిస్ట్​ను అతడి ఓపెనింగ్​ భాగస్వామిగా ఎంపిక చేశాడు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీని తన ఐపీఎల్ జట్టుకు సారథిగా నియమించాడు డుమిని. వీరితో పాటు రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్​.. ఆల్​రౌండర్ల జాబితాలో ఆండ్రూ రసెల్​, కీరన్​ పొలార్డ్​లను ఎంపిక చేశాడు. బౌలింగ్​ లైనప్​లో లసిత్​ మలింగ, బ్రెట్​ లీ.. స్పిన్నర్లలో ముత్తయ్య మురళీధరన్​, ఇమ్రాన్​ తాహిర్​లను తీసుకున్నాడు.

జేపీ డుమిని ఆల్​టైమ్​ ఐపీఎల్​ ఎలెవన్​:

క్రిస్​ గేల్​, ఆడమ్​ గిల్​క్రిస్ట్​, రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), ఏబీ డివిలియర్స్​, కీరన్​ పొలార్డ్​, ఆండ్రూ రసెల్​, బ్రెట్​ లీ, ముత్తయ్య మురళీధరన్​, లసిత్​ మలింగ, ఇమ్రాన్​ తాహిర్​​

ఇదీ చూడండి...''పెర్త్​'ను ఎంపిక చేయకపోవడానికి కారణం అదే'

Last Updated : May 30, 2020, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details