కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలు జరగక బోర్డులు ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. పలు దేశాల బోర్డులు ఇప్పటికే ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందరికీ పూర్తి జీతాలు చెల్లిస్తోంది. తాజాగా ఈ విషయమై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. ఐపీఎల్ వాయిదా పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలిపారు.
"గతేడాది అక్టోబర్ నుంచి ఖర్చుల్ని తగ్గించుకున్నాం. ఆటగాళ్ల , సిబ్బంది జీతాల్లో కోతలు విధించలేదు. కానీ రవాణా, ఆతిథ్యం లాంటి విషయాల్లో కటింగ్లు పెడుతున్నాం. ఒకవేళ ఐపీఎల్ జరగపోతే బోర్డుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పరిస్థితులను బట్టి లీగ్ నిర్వహణ గురించి ఆలోచిస్తాం"