తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2020, 10:32 AM IST

ETV Bharat / sports

'ఆ విషయంలో ధోనీని మించినోళ్లు లేరు'

మ్యాచ్​ గమనాన్ని పరిశీలించి, వ్యూహాలు రచించడంలో ధోనీని మించినవారు లేరని చెప్పాడు భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్. అలానే తాను ఆడిన మిగతా కెప్టెన్లు కుంబ్లే, ద్రవిడ్, గంగూలీల గురించి తెలిపాడు.

'ఆ విషయంలో ధోనీని మించినోళ్లు లేరు'
భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్

టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్.. తాను ఆడిన భారత మాజీ కెప్టెన్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్​ ధోనీల గురించి చెప్పాడు. ఒక్కొక్కరు ఒక్కో విషయంలో మాస్టర్లని అన్నాడు. అయితే మైదానంలో పరిస్థితుల్ని గమనించి, ఆలోచనలు అమలుపరచడంలో మహీని మించినోడు లేడని అన్నాడు. అతడికి ఇంకెవరు సాటిరారని తెలిపాడు.

"ధోనీ కంటే మ్యాచ్​ గమనాన్ని చదవగలిగే వారిని నేను చూడలేదు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. వ్యుహాలు రచించడం, సవాళ్లను ఛేదించడంలో అతడు దిట్ట. ఆ సమయంలో మహీ భిన్నంగా ఆలోచిస్తాడు" -ఆర్పీ సింగ్, భారత మాజీ బౌలర్

ధోనీతో భారత మాజీ బౌలర్ ఆర్పీ సింగ్

తాను ఆడిన వారిలో అనిల్ కుంబ్లే.. అత్యుత్తమ సారథి అని ఆర్పీ సింగ్ అన్నాడు. బౌలింగ్​ విభాగంలో ద్రవిడ్.. చిన్నపాటి మార్పులు చేస్తే, ధోనీ మాత్రం అప్పటికప్పుడు బౌలర్లను మార్చేసేవాడని చెప్పాడు. గంగూలీ అయితే తనను బాగా సహాయం చేసేవాడని తెలిపాడు.

టీమిండియా తరఫున ఆర్పీ సింగ్.. 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్​లు ఆడాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేసి, 2011లో చివరి మ్యాచ్​ ఆడాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం కామెంటేటర్​గా కొనసాగుతున్నాడు.

ధోనీ విషయానికొస్తే భారత్​కు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను అందించాడు. ఇలా మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక సారథి మహీనే కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details