గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆయనకు బైపాస్ సర్జరీ అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాల్లో ఇంకా పూడిక ఉందని.. దానివల్ల మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వారు వెల్లడించారు.
శనివారం ఉదయం జిమ్‌లో ఉండగా గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గంగూలీకి, తదుపరి చికిత్స అంశంపై సోమవారం మెడికల్ బోర్డు సమావేశమవుతుందని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ పేర్కొంది.
ఇదీ చూడండి: