తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్​ఇండియా ఇక పుంజుకోవడం అసాధ్యమే'

తొలిటెస్టులో ఘోర పరాజయం తర్వాత సిరీస్​లో టీమ్ఇండియా తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు​ మార్క్​ వా​. అడిలైడ్​ టెస్టులో టీమ్​ఇండియా​ గెలవడానికి మంచి అవకాశమని.. కానీ ఆ జట్టు ఓడిపోయిందని అన్నాడు. మెల్​బోర్న్​ వేదికగా డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

whitewash
టీమ్​ఇండియాకు వైట్​వాష్

By

Published : Dec 23, 2020, 5:36 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా వైట్​వాష్​ అవుతుందని జోస్యం చెప్పాడు ఆసీస్​ మాజీ క్రికెటర్​ మార్క్​ వా. తొలి టెస్టులో ఓడిన టీమ్​ఇండియా తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకం లేదని చెప్పాడు. రెండో టెస్టు నుంచి పితృత్వ సెలవులతో టీమ్ఇండియా సారథి కోహ్లీ గైర్హాజరీ తమకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. 4-0తో టెస్టు సిరీస్​ను తాము సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

"తొలి టెస్టు పరాజయం నుంచి భారత్‌ కోలుకోగలదని నేను అనుకోను. సిరీస్‌లో భారత్‌కు మ్యాచ్‌ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలైడ్‌లో తొలి టెస్టు. అక్కడికి పరిస్థితులు భారత బౌలర్లకు సహకరించాయి. కానీ మూడు రోజుల్లోనే వారు ఓడిపోయారు. కాబట్టి ఆసీస్​ చేతిలో భారత జట్టు వైట్​వాష్ అవుతుంది."

-మార్క్​ వా, ఆసీస్​ మాజీ క్రికెటర్​.

అడిలైడ్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్​లో కేవలం 36 పరుగులకే ఆలౌటై విమర్శలను ఎదుర్కొంటోంది. మెల్​బోర్న్​ వేదికగా డిసెంబరు 26 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి.

ఇదీ చూడండి :స్మిత్​కు కెప్టెన్సీ​.. ఆసీస్ బోర్డు ఏమంటోంది?

ABOUT THE AUTHOR

...view details