ప్రస్తుతం నూతన సెలక్షన్ కమిటీని ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. అందుకోసం నామినేషన్ల ప్రక్రియను ముగించింది. లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్, రాజేశ్ చౌహాన్, వెంకటేశ్ ప్రసాద్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎంపికైన సభ్యులు ఎప్పుడు బాధ్యతలు చేపడతారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.
"న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు పాత సెలక్షన్ కమిటీనే ఆటగాళ్లను ఎంపిక చేసింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కోసం జట్టును కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ పదవుల కోసం త్వరలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయి."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు