పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్‌ను జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్. కోచింగ్‌లో క్లబ్ లెవల్లో కూడా అనుభవం లేని మిస్బాను ఎలా నియమిస్తారని అన్నాడు. ఏ ప్రామాణికంగా అతడిని ఇంకా కోచ్‌గా కొనసాగిస్తున్నారని పీసీబీని ప్రశ్నించాడు.
"కోచ్ పదవి విషయంలో పీసీబీ ద్వంద వైఖరి అర్థం కావట్లేదు. ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస అనుభవం ఉండాలనే షరతును పీసీబీ పెట్టింది. కానీ క్లబ్ లెవల్లో కూడా కోచింగ్ అనుభవం లేని మిస్బావుల్‌ను ఎంపిక చేసింది."
-మహ్మద్ యూసఫ్, పాక్ మాజీ క్రికెటర్
ఆటగాళ్లు, సారథి నిజాయితీగా, నిస్వార్థంగా ఉండాలని మిస్బా అంటున్నాడని.. కానీ అతడు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అజహర్ అలీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పగలడా? అంటూ యూసఫ్ ప్రశ్నించాడు.
"అజహర్ అలీ మంచి బ్యాట్స్‌మన్. అయితే అతడు క్రీజులో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. మిస్బా కూడా అంతే. అతడి ఆటలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేదు. ఒకే రీతిలో రక్షణాత్మకంగా ఆడతాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగేవరకు వేచి చూసి ఆ తర్వాత పరుగులు రాబట్టేవాడు."
-మహ్మద్ యూసఫ్, పాక్ మాజీ క్రికెటర్
మిస్బావుల్ పాక్ తరఫున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికి పాక్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమాకమయ్యాడు.