న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయి, ప్రత్యర్థి చేతిలో వైట్‌వాష్ అయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తమ ఆటగాళ్ల చేసిన తప్పిదాల వల్లే ఓడామని అన్నాడు.
సాకులు చెప్పను.. ఓటమిని అంగీకరిస్తున్నా: విరాట్ కోహ్లీ - Kohli latest news
కివీస్‌పై టెస్టు సిరీస్ ఓటమి అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తాము చేసిన తప్పిదాల వల్లే ఓడామని అన్నాడు. సాకులు చెప్పదల్చుకోవట్లేదని చెప్పాడు.
"ఈ ఓటమిని మేం అంగీకరిస్తున్నాం. సాకులు చెప్పడానికి ఏం లేదు. వీటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు పోతాం. టెస్టుల్లో మేం అనుకున్నంతగా ఆడలేకపోయాం. ఈ మ్యాచ్‌లో బౌలర్ల కష్టానికి తగ్గట్లు బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం దురదృష్టకరం. రోహిత్ అందుబాటులో లేడు. నేనూ పరుగులు చేయలేకపోయాను" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
కివీస్ పర్యటనలో భారత్.. టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో గెల్చుకోగా, వన్డేల్లో 0-3, టెస్టుల్లో 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. అయితే ఈ టూర్లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు విరాట్.