వేలి గాయం కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌కు దూరమయ్యాడు శిఖర్ ధావన్. అయితే ఈ విషయాన్ని విషయంపై ట్విట్టర్ వేదికగా భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు. ధావన్ పోస్ట్‌పై స్పందించినప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అతడికి బాధ పడొద్దని సూచించారు. మైదానం.. నీ ఆటను మిస్సవుతోందని అన్నారు.
"ప్రియమైన శిఖర్ ధావన్, క్రికెట్ పిచ్.. నీ ఆటను మిస్ అవుతోంది. గాయం నుంచి నువ్వు త్వరగా కోలుకుని దేశానికి విజయాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నా." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి