తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్ కోహ్లీకే నా మద్దతు: గంభీర్

కోహ్లీ కావాలనే గంగూలీని ప్రశంసించాడన్న గావస్కర్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్ స్పందించాడు. అందులో విరాట్ తప్పేమీ లేదని అన్నాడు.

By

Published : Nov 28, 2019, 1:12 PM IST

Gautam Gambhir
గంభీర్

బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్​లో జరిగిన డే/నైట్​ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2-0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు విదేశాల్లో విజయాలకు గంగూలీ సారథ్యంలోనే బీజం పడిందని కితాబిచ్చాడు. ఈ విజయాలు వాటికి కొనసాగింపని అన్నాడు. ఈ విషయాన్ని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ వ్యతిరేకించాడు.

భారత్‌ క్రికెట్ జట్టు విదేశీ విజయాలు సాధించింది.. 70-80 దశకాల్లోనేని గావస్కర్ చెప్పాడు. గంగూలీని పొగడాలనే ఉద్దేశంతోనే కోహ్లీ ఇలా చేశాడని అన్నాడు. తాము విజయాలు సాధించే సరికి కోహ్లీ ఇంకా పుట్టనేలేదంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. తాజాగా ఈ విషయంపై విరాట్​కు.. భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌ మద్దతుగా నిలిచాడు.

"అది కోహ్లీ వ్యక్తిగత ఆలోచన. అతడు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు విదేశాల్లో ఎక్కువగావిజయాల్ని నమోదు చేసింది. వాటికి బీజం పడింది గంగూలీ కెప్టెన్సీలోనే. ఇక గావస్కర్‌, కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు స్వదేశంలో ఎక్కువ విజయాలు సాధించేది. ఈ విషయంలో నేను కోహ్లీతో అంగీకరిస్తా" -గౌతమ్ గంభీర్, మాజీ ఆటగాడు

టీమిండియా.. వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సిరీస్​కు సిద్ధమవుతోంది. వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది కోహ్లీసేన.
ఇవీ చూడండి.. థియేటర్​లో విరుష్క జోడీ.. ఫొటో వైరల్​

ABOUT THE AUTHOR

...view details