న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ఊపిరి పీల్చుకున్నాడు! అతడికి కరోనా వైరస్ లేదని తేలింది. త్వరలోనే అతడు సొంత దేశానికి వస్తాడని బ్లాక్‌క్యాప్స్ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియాతో తొలి వన్డే ముగిశాక గొంతులో నొప్పిగా ఉందని ఫెర్గూసన్ జట్టు యాజమాన్యానికి తెలియజేశాడు. కొవిడ్ -19 లక్షణాలు ఉన్నాయేమోనని ముందు జాగ్రత్తగా.. అతడి నమూనాలను పరీక్ష కోసం పంపించారు. వెంటనే ఐసోలేషన్‌లో ఉంచారు. పరీక్షల్లో ఈ క్రికెటర్‌కు కరోనా లేదని తేలడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హమ్మయ్య కరోనా లేదు.. ఊపిరి పీల్చుకున్న ఫెర్గూసన్ - Lockie Ferguson latest news
న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్‌కు.. కరోనా వైద్యపరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఫలితంగా ఈ క్రికెటర్‌కు వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా ఇతడు తీవ్ర గొంతునొప్పికి గురయ్యాడు. ఫలితంగా దాదాపు 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక వార్డులో ఉంచి పరిశీలించారు.

హమ్మయ్య కరోనా లేదు.. ఊపిరి పీల్చుకున్న ఫెర్గూసన్
" ఇంటికొస్తున్నాడు. లాకీ ఫెర్గూసన్ విమాన ప్రయాణం చేసేందుకు అనుమతి లభించింది. ఆదివారం న్యూజిలాండ్‌కు వస్తాడు" అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.
ఆసీస్ క్రికెటర్ రిచర్డ్‌సన్ సైతం గొంతునొప్పని చెప్పడం వల్ల అతడకీ పరీక్షలు చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్.. కరోనా కారణంగా రద్దయింది.