తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓగా నిక్ హోక్లే - క్రికెట్ ఆస్ట్రేలియాకు కెవిన్ రాబర్ట్స్ రాజీనామా

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ పదవికి కెవిన్ రాబర్ట్స్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ సీఈఓ నిక్ హోక్లే తాత్కాలిక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకమయ్యారు.

Nick Hockley
నిక్ హోక్లే

By

Published : Jun 16, 2020, 10:56 AM IST

క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ) ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు కెవిన్​ రాబర్ట్స్​ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ సీఈఓ నిక్ హోక్లేను తాత్కాలికంగా నియమిస్తూ ఆసీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కెవిన్

పక్షం రోజులుగా బోర్డులో కెవిన్​ రాబర్ట్స్​ మద్దతు కోల్పోయారని.. దీంతో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని క్రికెట్ ఆస్ట్రేలియా సభ్యులు డిమాండ్ చేశారు. ఫలితంగా ప్రస్తుతానికి తాత్కాలిక సీఈఓను నియమిస్తూ ప్రకటన చేశారు క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్.

వ్యతిరేకతకు కారణం

కరోనా సంక్షోభంలో ఆర్థిక సమస్యల కారణంగా క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రధాన కార్యాలయంలో విధించిన షట్​డౌన్​పై కెవిన్ రాబర్ట్స్​ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవలే 80 శాతం మంది సిబ్బందిని తిరిగి విధుల్లోకి రప్పించాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయనపై వ్యతిరేకత తగ్గలేదు.

గతంలో క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ) చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​గా పనిచేసిన రాబర్ట్స్​.. అక్టోబరు 2018లో జేమ్స్​ సదర్లాండ్​ నిష్క్రమించిన తర్వాత సీఈఓగా నియామకం అయ్యారు. వచ్చే ఏడాదితో రాబర్ట్స్ పదవీ కాలం ముగియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details