తెలంగాణ

telangana

ETV Bharat / sports

నికోలస్ పూరన్​పై నాలుగు మ్యాచ్​ల నిషేధం - Nicholas Pooran Suspended For Four Matches For Ball-Tampering

వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్​పై నాలుగు మ్యాచ్​ల నిషేధం పడింది. బాల్ ట్యాంపరింగ్​కు​ పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

పూరన్

By

Published : Nov 13, 2019, 6:03 PM IST

వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అఫ్గానిస్థాన్​తో జరిగిన మూడో వన్డేలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేరానికి పూరన్ బహిరంగ క్షమాపణ చెప్పాడు.

పూరన్ బాల్ ట్యాంపరింగ్

"నేను తప్పు చేశానని గుర్తించాను. ఐసీసీ పెనాల్టీని పూర్తిగా అంగీకరిస్తున్నా. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కానివ్వను."
-నికోలస్ పూరన్, వెస్టిండీస్ క్రికెటర్

ఈ నిషేధంతో నికోలస్ పూరన్ నాలుగు టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో ఐదు డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. ఫలితంగా లఖ్​నవూ వేదికగా వెస్టిండీస్-అఫ్గానిస్థాన్​ జట్ల మధ్య గురువారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో అతడు ఆడటం అనుమానమే.

"నికోలస్ ఆర్టికల్ 2.14ను ఉల్లంఘించాడు. అంటే బాల్​ కండీషన్​ను మార్చడానికి ప్రయత్నించాడు. ఇందువల్ల అతడిపై నాలుగు మ్యాచ్​ల నిషేధం పడనుంది"
-ఐసీసీ
అసలేం జరిగింది..?

లఖ్​నవూ వేదికగా అఫ్గానిస్థాన్​తో జరిగిన మూడో వన్డేలో బంతిని అందుకున్న నికోలస్ పూరన్ దానిపై ఉన్న తేమని తుడిచే కారణంతో బాల్ ట్యాంపరింగ్‌కి యత్నించాడు. గోటితో బలంగా పదే పదే రుద్దడం ద్వారా బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడ్డాడు. ఇది కాస్త వీడియోలో స్పష్టంగా రికార్డు కావడం వల్ల ఐసీసీ నికోలస్ పూరన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

ఇవీ చూడండి.. 'నేనూ కుంగుబాటు సమస్య ఎదుర్కొన్నా'

ABOUT THE AUTHOR

...view details