తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాబిన్​తో టీమిండియా కోచ్ ఇంటర్వ్యూలు షురూ

టీమిండియా కోచ్ ఇంటర్వ్యూలు ముంబయి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. మాజీ ఆల్​రౌండర్​ రాబిన్​సింగ్​ను మొదటగా మౌఖిక పరీక్ష నిర్వహిస్తోంది కపిల్​దేవ్​ నేతృత్వంలోని సలహా కమిటీ.

కపిల్​దేవ్

By

Published : Aug 16, 2019, 11:41 AM IST

Updated : Sep 27, 2019, 4:23 AM IST

భారత జట్టుకు కోచ్​ను ఎంపిక చేసే మహత్కర ఘట్టానికి ముహూర్తం నేడే. ముంబయి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. మొదటగా మాజీ క్రికెటర్, ఆల్​రౌండర్​ రాబిన్​సింగ్​కు మౌఖిక పరీక్ష నిర్వహించింది కపిల్​దేవ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.

రాబిన్​సింగ్​తో పాటు ఆరుగురికి ఈ రోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రవిశాస్త్రి, లాల్​చంద్ రాజ్​పుత్​, మైక్​ హెసన్, టామ్​ మూడి, ఫిల్​ సిమన్స్​ ఈ జాబితాలో ఉన్నారు. కోచ్​ ఎవరన్న అంశంపై రాత్రి 7 గంటలకు ప్రకటన వెలువడనుంది.

రాబిన్​సింగ్ గతంలో ముంబయి ఇండియన్స్​ కోచ్​గా పనిచేశాడు. జాతీయ జట్టు మేనేజర్​గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

కపిల్​ దేవ్​తో పాటు అన్షుమాన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి.. కోచ్​ను ఎంపికచేసే క్రికెట్ సలహా సంఘంలో(సీఏసీ) సభ్యులుగా ఉన్నారు.

ఇది చదవండి: మాజీ క్రికెటర్ చంద్రశేఖర్​​ ఆత్మహత్య

Last Updated : Sep 27, 2019, 4:23 AM IST

ABOUT THE AUTHOR

...view details