తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంకపై పది వికెట్ల తేడాతో కివీస్​ ఘనవిజయం

ప్రపంచకప్​లో న్యూజిలాండ్ జట్టు శుభారంభం చేసింది. శ్రీలంకపై పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు గప్తిల్, మన్రో.. వికెట్ పడకుండానే 137 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.

ఆడుతూ పాడుతూ న్యూజిలాండ్​ గెలుపు

By

Published : Jun 1, 2019, 7:45 PM IST

కార్డిఫ్ వేదికగా జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో శ్రీలంకపై న్యూజిలాండ్​ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంకేయులు నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించి.. ప్రపంచకప్​లో శుభారంభం చేసింది. కివీస్​ ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలతో చెలరేగారు.

137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్​ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు గప్తిల్, మన్రో... ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఈ క్రమంలోనే అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. గప్తిల్ 73, మన్రో 58 పరుగులతో నాటౌట్​గా నిలిచారు. ప్రపంచకప్​లో న్యూజిలాండ్​ తొలి విజయం నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

న్యూజిలాండ్​ బ్యాట్స్​మెన్ గప్తిల్

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక.. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ తిరిమన్నె అర్ధ శతకం చేశాడు. మిగతా బ్యాట్స్​మెన్​లో కుశాల్ పెరీరా 29, తిశారా పెరీరా 27 మినహా మిగిలిన వారందరూ సింగిల్​ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్​ బౌలర్ల ధాటికి 136 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.

శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె

కివీస్ బౌలర్లలో హెన్రీ, ఫెర్గ్యూసన్ తలో మూడు వికెట్లు తీశారు. బౌల్ట్, గ్రాండ్​హోమ్, నీషమ్, శాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ల్యూక్ ఫెర్గ్యూసన్

ABOUT THE AUTHOR

...view details