తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు మ్యాచ్​ గెలిచినా ఒక్క పాయింట్​ రాదు! - cricket news telugu

ఈ ఏడాది ప్రపంచకప్​ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ జట్లు... ప్రస్తుతం ఓ టెస్టు సిరీస్​లో తలపడుతున్నాయి. రెండు మ్యాచ్​ల ఈ సిరీస్​లో ఏ జట్టు గెలిచినా ఒక్క పాయింట్​ కూడా రాదు. ఓ వైపు భారత్​, మరోవైపు ఆస్ట్రేలియా విజయాల దూకుడుతో పాయింట్లు పెంచుకుంటుంటే.. మరి వీటికేమైందని అనుకుంటున్నారా?. అయితే ఇది చదవండి.

Newzeland vs England 2019 series is not part of World Test Championship
టెస్టు సిరీస్​ గెలిచినా ఒక్క పాయింట్​ రాదు..!

By

Published : Nov 26, 2019, 2:39 PM IST

సుదీర్ఘ పార్మాట్​కు ఆదరణ తగ్గుతున్న సమయంలో... టెస్టు ఛాంపియన్​షిప్​ను తెరపైకి తెచ్చింది ఐసీసీ. రెండేళ్లు జరగనున్న ఈ టోర్నీలో టాప్​-10 జట్లు స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరీస్​లు తలపడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​తో పోటీ పడింది టీమిండియా. అయితే ఇప్పటికే పాయింట్ల పట్టికలో 360 మార్కులతో కోహ్లీ సేన టాప్​-1లో ఉండగా... న్యూజిలాండ్​, ఇంగ్లాండ్ జట్లూ తమ స్థానం మెరుగుపర్చుకోవాలని పోటీపడుతున్నాయి.

ఇటీవల ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్​ ప్రారంభమైంది. ఇందులో గెలిచినా ఏ జట్టుకూ ఒక్క పాయింటూ రాదు. ఎందుకంటే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(2019-21) నిబంధన ప్రకారం ప్రతిజట్టూ ఆరు సిరీస్‌లు ఆడుతుంది. ఆ మ్యాచ్​లు ఎక్స్​ట్రా జరిగిన సిరీస్​లకు పాయింట్లు ఇవ్వదు ఐసీసీ.

అందుకే ఐసీసీ ముందుగా తయారుచేసిన షెడ్యూల్​ ప్రకారం.. ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ టెస్టు సిరీస్​ను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే ఒకవేళ ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగమైతే... తొలి టెస్టులో గెలిచిన కివీస్‌ ఖాతాలో 60 పాయింట్లు చేరేవి. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన చేసిన బ్లాక్​ క్యాప్స్​... ఇన్నింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఫలితంగా రెండు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది కివీస్​ జట్టు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా డబుల్‌ సెంచరీ హీరో వాట్లింగ్‌ నిలిచాడు. రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

ABOUT THE AUTHOR

...view details