తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ కప్​ ఆడే న్యూజిలాండ్​ జట్టిదే - బౌల్ట్‌

ఇంగ్లండ్​ వేదికగా జరగనున్న ప్రపంచకప్​లో ఆడే జట్టును ప్రకటించింది న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు. కేన్​ విలియమ్సన్​ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లను వరల్డ్​కప్​​ కోసం ఎంపిక చేసింది.

ప్రపంచకప్​కు సిద్ధమైన న్యూజిలాండ్​​ జట్టు

By

Published : Apr 4, 2019, 5:14 AM IST

ప్రపంచకప్​ టోర్నీ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసింది న్యూజిలాండ్​​ క్రికెట్​ బోర్డు. కేన్​ విలియమ్సన్​ సారథ్యంలోని 15 మంది జట్టు సభ్యుల పేర్లను ప్రకటించింది. ఇంగ్లండ్‌-వేల్స్‌ వేదికగా మే 30న ప్రపంచకప్​ సంగ్రామం ప్రారంభమవుతుంది.

15 మంది జాబితా విడుదల చేసిన న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు

సీనియర్​ ఆటగాళ్లు రాస్‌ టేలర్‌, గప్తిల్‌, ట్రెంట్​ బౌల్ట్‌, సౌథీలకు జట్టులో చోటు దక్కింది. అదనపు​ కీపర్​గా బ్లన్​డెల్​ ఎంపికయ్యాడు.

బౌల్ట్‌, సౌథీలతో న్యూజిలాండ్​ పేస్‌ బౌలింగ్​ బలంగా ఉంది.విలియమ్సన్‌, టేలర్‌, లాథమ్‌, మున్రోలతో బ్యాటింగ్‌ లైనప్​ పటిష్ఠంగా ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్​లో మూడో స్థానంలో ఉన్న కివీస్​ టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది.

  • కివీస్‌ జట్టు:

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టామ్‌ బ్లన్‌డెల్‌, ట్రెంట్‌ బోల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, ఫెర్గుసన్‌, మార్టిన్‌ గప్తిల్‌, మ్యాట్‌ హెన్రీ, టామ్‌ లాథమ్‌, కోలిన్‌ మున్రో, నీషమ్‌, నికోలస్‌, శాంటర్న్‌, ఇష్‌ సోది, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌

ABOUT THE AUTHOR

...view details