టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు ఉందట. అవును మీరు విన్నది నిజమే. జాతీయ దర్యాప్తు సంస్థకు అందిన సమాచారం ప్రకారం కొత్తగా ఏర్పాటైన ఆల్ ఇండియా లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠా తమ హిట్ లిస్టులో కోహ్లీ పేరు చేర్చింది.
ప్రస్తుతం భారత క్రికెట్లో కోహ్లీ హవా నడుస్తోంది. టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడీ ఆటగాడు. అయితే విరాట్‌పై పని భారాన్ని తగ్గించడానికి బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చింది సెలక్షన్ కమిటీ. ఇతడి స్థానంలో రోహిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.