తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రాక్టీస్​ టెస్టులో పంత్​ బౌండరీల మోత

భారత యువ వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ ప్రాక్టీస్​ మ్యాచ్​లో దుమ్ముదులిపాడు. సరైన ఫామ్​ లేక తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న పంత్​​... భారత్​ X న్యూజిలాండ్ మధ్య జరిగిన​ ఎలెవన్​ ప్రాక్టీస్​ టెస్టులో చెలరేగాడు. హామిల్టన్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యువ బ్యాట్స్​మెన్​ 8 బౌండరీలతో సత్తా చాటాడు.

Rishabh Pant showed form with half hundred
ప్రాక్టీస్​ టెస్టులో పంత్​ బౌండరీల మోత

By

Published : Feb 16, 2020, 11:06 AM IST

Updated : Mar 1, 2020, 12:23 PM IST

భారత క్రికెట్‌ జట్టులో ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచిన ఆటగాడు రిషబ్​ పంత్​. పలు సిరీస్​ల్లో వికెట్​ కీపర్​, బ్యాట్స్​మెన్​గా చోటిచ్చినా.. సరైన ప్రదర్శన చేయలేక విఫలమయ్యాడు. అందుకే అతడి స్థానంలో కేఎల్​ రాహుల్​ను కీపింగ్​కు పరీక్షించారు. అతడి అద్భుత ఫామ్​ కారణంగా తుది జట్టులో చోటు కోల్పోయాడు పంత్​. తాజాగా న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​కు బ్యాకప్​ కీపర్​గా ఎంపికైన పంత్​.. ప్రాక్టీస్​ మ్యాచ్​లో చెలరేగి ఆడాడు.

వన్డే తరహాలో పంత్​ ఆట...

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడో హాఫ్‌ సెంచరీ సాధించిన పంత్‌‌.. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మళ్లీ సూపర్​ ఫామ్​ ప్రదర్శించాడు. ఈ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్‌లో అర్థ శతకం సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌లో పరుగులు రాబట్టాలనే కసి కనిపించింది. తొలుత నెమ్మదిగా ఆడిన పంత్‌.. ఆ తర్వాత తనదైన శైలిలో ఆడాడు. హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

మ్యాచ్​ 'డ్రా' అయింది..

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పృథ్వీ షా 39 (31 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్​), మయాంక్‌ అగర్వాల్‌ 81 రిటైర్డ్‌ హర్ట్‌ (99 బంతుల్లో; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మంచి ఆరంభాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన వీరిద్దరూ.. రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్​కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పృథ్వీ షా ఔటైన తర్వాత వన్​డౌన్‌లో వచ్చిన శుభ్​మన్‌ గిల్‌ (8) మరోసారి నిరాశపర్చాడు. ఫలితంగా తొలి టెస్టులో పృథ్వీ, మయాంక్​ ఓపెనింగ్​ దిగే అవకాశముంది. ఈ మ్యాచ్​లో సాహా (30), అశ్విన్​ (16) అజేయంగా నిలిచారు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయ్యింది. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 235 పరుగులకే ఆలౌటైంది.

ఈ మ్యాచ్​తో బుమ్రా మళ్లీ తన వికెట్ల వేట ప్రారంభించాడు. న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​లో ఒక వికెట్​ కూడా సాధించని జస్ప్రీత్​.. తాజా ప్రాక్టీస్​ టెస్టులో 2 వికెట్లు సాధించాడు. షమీ 3, ఉమేశ్​ 2, సైనీ 2, అశ్విన్​ ఒక వికెట్​ సాధించారు.

Last Updated : Mar 1, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details