తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాకబ్ అదుర్స్.. పాక్​పై కివీస్ గెలుపు - క్రికెట్ వార్తలు

మొదటి మ్యాచ్​లో పాక్​పై గెలిచిన కివీస్.. మూడు టీ20ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.​ తొలి మ్యాచ్​లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు జాకబ్ డఫ్ఫీ.

new zealand won first T20 by 5 wickets against pakistan
అరంగేట్రంలోనే అదుర్స్.. పాక్​పై కివీస్ గెలుపు

By

Published : Dec 18, 2020, 4:23 PM IST

ఆక్లాండ్​ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో​ న్యూజిలాండ్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది. అరంగేట్ర మ్యాచ్​లోనే బౌలింగ్​తో ఆకట్టుకున్న జాకబ్ డఫ్ఫీ(4/33) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కెప్టెన్ షాదాబ్ ఖాన్(42) టాప్ స్కోరర్. మిగిలిన వారిలో ఫహీమ్ ఆష్రఫ్ 31, ఇమాద్ వసీమ్ 19, ఖుష్​దిల్ 16, రిజ్వాన్ 17 తక్కువ పరుగులే చేశారు. కివీస్ బౌలర్లలో జాకబ్ 4, కగ్లింజన్ 3, సోదీ, టిక్నర్ తలో వికెట్ పడగొట్టారు.

కివీస్ ఓపెనర్ టిమ్ సైఫర్ట్

అనంతరం లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో పూర్తి చేసింది న్యూజిలాండ్. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (57) విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన బ్యాట్స్​మెన్​లో గ్లెన్ ఫిలిప్స్ 23, మార్క్​ చాప్​మన్ 34, నీషమ్ 15, శాంట్నర్ 12 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హరీశ్ రవూఫ్ 3, షాహీన్ అఫ్రిది 2 వికెట్లు తీశారు. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(డిసెంబరు 20) జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details