తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లీష్ జట్టుపై కివీస్​ ఇన్నింగ్స్ విజయం - nz vs eng

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్​ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్​ 65 పరుగుల తేడాతో గెలిచి సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

న్యూజిలాండ్

By

Published : Nov 25, 2019, 1:00 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 55/3తో సోమవారం ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లీష్‌ జట్టు 197 పరుగులకే ఆలౌటైంది. నీల్‌ వాగ్నర్‌ 5, మిచెల్‌ శాంట్నర్‌ 3 వికెట్లతో సత్తాచాటారు. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ బోణీ కొట్టింది.

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్​లో 353 పరుగులు చేసింది. బెన్‌స్టోక్స్‌(91), జో డెన్లీ(74) రాణించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వాట్లింగ్‌(205), మిచెల్‌ శాంట్నర్‌(126)లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా ఆ జట్టు 615/9 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. న్యూజిలాండ్​కు 262 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించారు.

ఇవీ చూడండి.. అనుష్క ఒడిలో కోహ్లీ.. ఫొటోలు వైరల్

ABOUT THE AUTHOR

...view details