పాకిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించింది న్యూజిలాండ్. 9 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మహ్మద్ హఫీజ్(99 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.
హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మహ్మద్ హఫీజ్(57 బంతుల్లో 99 నాటౌట్) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిగిలిన వారిలో రిజ్వాన్(22) మినహా అందరూ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 4, నీషమ్, సోధీ తలో వికెట్ తీశారు.
టిమ్ సీఫర్ట్ - కేన్ విలియమ్సన్ అనంతరం కివీస్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సీఫర్ట్(84*), విలియమ్సన్(57*) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఫహీమ్ అష్రఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.
నాలుగో క్రికెటర్‌గా హఫీజ్
40 ఏళ్ల పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్.. ఈ మ్యాచ్‌లో చివరి 3 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తద్వారా 99 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 99* చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు అలెక్స్ హేల్స్, ల్యూక్ రైట్, డేవిడ్ మలన్ ఉన్నారు.
పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్