తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​​కు ఎదురుదెబ్బ... భారత్​తో సిరీస్​కు లాథమ్​ దూరం - New Zealand wicketkeeper,batsman Tom Latham out of India T20Is with finger fracture

త్వరలో న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లనుంది భారత్. ఈ సమయంలో ఆతిథ్య జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ వికెట్​ కీపర్​ టామ్​ లాథమ్..​ వేలి గాయం కారణంగా టీ20 సిరీస్​కు దూరం కానున్నాడు. ఇతడితో పాటు సీనియర్​ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​ గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

New Zealand wicketkeeper,batsman Tom Latham out of India T20Is with finger fracture
కివీస్​​కు ఎదురుదెబ్బ... భారత్​తో టీ20 సిరీస్​కు లాథమ్​ దూరం

By

Published : Jan 8, 2020, 5:19 PM IST

టీమిండియాతో ఉత్కంఠకర పోరుకు సిద్ధమవుతున్న కివీస్​ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాట్స్​మన్​ టామ్​ లాథమ్​... వేలి గాయంతో టీ20 సీరీస్​కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఈ దెబ్బ తగిలినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రికెటర్​కు నెల రోజులు విశ్రాంతి సూచించారు వైద్యులు. ఫలితంగా భారత్​తో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు దూరం కానున్నాడు.

ఇతడితో పాటు న్యూజిలాండ్​ పేసర్లు​ ట్రెంట్​ బౌల్ట్​, ల్యూక్ ఫెర్గుసన్​.. గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. మ్యాచ్​లు మొదలయ్యేసరికివీరిద్దరూ కోలుకుంటారని యాజమాన్యం భావిస్తోంది. వీరిపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

కొన్ని రోజులుగా న్యూజిలాండ్​ జట్టు గాయాలతో బాధపడుతోంది. ఆ దేశ బౌలర్​ మ్యాట్​​​ హెన్రీ వేలి గాయంతో విశ్రాంతి తీసుకొని.. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​కు అందుబాటులోకి వచ్చాడు. కివీస్​ సారథి కేన్​ విలియమ్సన్​, మిచెల్​ శాంట్నర్​, నికోలస్​ హెన్రీ.. జ్వరం నుంచి కోలుకున్నారు. తాజాగా ఆసీస్​తో మూడు టెస్టులు ఆడితే అన్నింట్లోనూ ఓడిపోయింది కివీస్.

ఈనెల 24 నుంచి మార్చి 4 మధ్య న్యూజిలాండ్​లో పర్యటించనుంది టీమిండియా. ఇందులో భాగంగా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్నాయి ఇరుజట్లు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details