న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత అర్ధశతకంతో జట్టుకు విజయాన్నందించాడు టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్. 29 బంతుల్లో 58 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్.. సీనియర్లు కోహ్లీ, రోహిత్ శర్మలను చూసి చాలా నేర్చుకున్నానని చెప్పాడు.
"సిక్స్‌తో జట్టుకు విజయాన్నందించడం చాలా సంతోషాన్నిచ్చింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది. మైదానం చాలా చిన్నదిగా ఉంది. నాలుగు ఓవర్లలో 50 పరుగులు ఈ గ్రౌండ్లో చాలా తేలిక. బౌండరీలు కొట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచాలని చూశాం. టీమండియాలో కోహ్లీ, రోహిత్ లాంటి గొప్ప ఆటగాళ్లున్నారు. పినిషింగ్ ఎలా చేయాలో వారిని చూసి నేర్చుకున్నా"
-శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్