తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​Xన్యూజిలాండ్​: రెండో టీ20లో రికార్డుల హోరు - ravindra jadeja

ఆక్లాండ్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు సమష్టిగా రాణించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్​లో 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్​లో తొలుత బౌలింగ్​ చేసిన కోహ్లీ సేన.. కివీస్​ బ్యాట్స్​మెన్​ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

New Zealand vs India: All players Records in Auckland 2nd T20I
భారత్​Xన్యూజిలాండ్​: రెండో టీ20లో రికార్డులివే

By

Published : Jan 27, 2020, 5:27 AM IST

Updated : Feb 28, 2020, 2:33 AM IST

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌(57*; 50 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(44; 33 బంతుల్లో 1ఫోర్​, 3సిక్సర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. రోహిత్‌శర్మ(8; 6 బంతుల్లో 2ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(11; 12 బంతుల్లో 1x4) విఫలమయ్యారు. శ్రేయస్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శివమ్‌ దూబె(8; 4 బంతుల్లో 1సిక్సర్​) రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్​లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

>>న్యూజిలాండ్​పై రెండు టీ20 మ్యాచ్​లు వరుసగా గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి.

>> ఆక్లాండ్‌లోని ఈడెన్​ మైదానం టీమిండియాకు ఫేవరెట్​గా మారింది. ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ భారత్​ విజయం సాధించింది. ఈ వేదికపై వరుసగా మూడు టీ20లు గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.

  • రాహుల్​ అదుర్స్​...

>>కేఎల్​ రాహుల్​ తన చివరి అయిదు టీ20ల్లో నాలుగు అర్ధశతకాలు (91, 45, 54, 56, 57*) సాధించాడు.

>> టీ20ల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్​మెన్​ జాబితాలో చోటు దక్కించుకున్నాడు కేఎల్​ రాహుల్​. కోహ్లీ ఈ ఫీట్​ను మూడు సార్లు(2012, 2014, 2016) సాధించగా... రోహిత్​(2018), రాహుల్​(2020) ఒక్కోసారి అందుకున్నారు.

>>పొట్టి ఫార్మాట్​లో న్యూజిలాండ్​పై అత్యధిక హాఫ్​ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్​ రాహుల్​ అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా మ్యాచ్​లో రెండోది నమోదు చేశాడు. ఇప్పటికే శ్రేయస్​ అయ్యర్​, రైనా, రోహిత్​, యువరాజ్​ తలో ఒక్క అర్ధశతకం సాధించారు.

  • కోహ్లీ రెండో స్థానం...

టీ20ల్లో వ్యక్తిగత 35 ఇన్నింగ్స్​ల తర్వాత నుంచి లెక్కిస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో.. కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్​ క్రికెటర్​ బాబర్​ అజామ్​(1399), కోహ్లీ(1368), కేఎల్​ రాహుల్​(1350) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మిగతా ఏ క్రికెటర్​ 1200లకు పైగా రన్స్​ చేయలేకపోయారు.

>> కోహ్లీ, రాహుల్​ కలిసి చివరగా ఆడిన నాలుగు టీ20ల్లో 325 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • సిక్సర్లతోనే...

భారత్​ చివరిగా ఆడిన నాలుగు ఛేదనల్లో అన్ని మ్యాచ్​లను సిక్సర్లతోనే ముగించారు భారత బ్యాట్స్​మెన్​​.

వెస్టిండీస్​పై (కోహ్లీ)​-2019

శ్రీలంకపై (కోహ్లీ​)-2020

న్యూజిలాండ్​పై (శ్రేయస్​ అయ్యర్​)​- 2020

న్యూజిలాండ్​పై (శివమ్​ దూబే)​-2020

జడేజా అత్యుత్తమం..

>> ఈ మ్యాచ్​లో అద్భుతమైన బౌలింగ్​ ప్రదర్శన నెలకొల్పాడు భారత స్పిన్నర్​ రవీంద్ర జడేజా. టీ20ల్లో న్యూజిలాండ్​పై తక్కువ పరుగులు ఇచ్చిన ఆటగాళ్లలో ఇతడు రెండో అత్యుత్తమ బౌలర్​గా నిలిచాడు.

హర్భజన్​- 15/1 (2009)

రవీంద్ర జడేజా- 18/2 (2020)

హర్భజన్​ - 19/1 (2009)

అంతేకాకుండా జడేజా బౌలింగ్​లోనే న్యూజిలాంండ్​ ఆటగాడు డీ గ్రాండ్​ హోమ్​ వరుసగా రెండు మ్యాచ్​ల్లోనూ గోల్డెన్​ డకౌట్​ అయ్యాడు.

>> కోహ్లీని అత్యధికసార్లు ఔట్​ చేసిన పేస్​ బౌలర్ల జాబితాలో అండర్సన్​ సరసన నిలిచాడు సౌథీ. వీరిద్దరూ 8సార్లు విరాట్​ను పెవిలియన్​ చేర్చాడు. మోర్కెల్​, రాంపాల్​ (7 సార్లు) ఈ జాబితాలో తర్వాత స్థానంలో ఉన్నారు.

>> గత 11 టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఎనిమిది సార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అంతేకాకుండా రోహిత్‌ తన కెరీర్‌లో 50 శాతానికిపైగా మ్యాచ్‌ల్లో పది బంతుల్లోపే ఔటయ్యాడు.

>> అంతర్జాతీయ క్రికెట్​లో టిమ్​ సౌథీ చేతిలో ఎక్కువ సార్లు ఔటైన జాబితాలో రోహిత్​ రెండోస్థానంలో నిలిచాడు. 9సార్లు ఇతడు పెవిలియన్​ చేరాడు. కరుణరత్నే(10) మొదటి స్థానంలో ఉండగా.. తమీమ్(9)​, మాథ్యూస్(8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.​

>> టీ20ల్లో అత్యధిక క్యాచ్​లు పట్టిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు కోహ్లీ. రైనా(42), కోహ్లీ(41), రోహిత్​(39) జాబితాలో వరుసగా ఉన్నారు.

Last Updated : Feb 28, 2020, 2:33 AM IST

ABOUT THE AUTHOR

...view details