ఈడెన్ పార్క్, సెడాన్ పార్క్‌ల్లో విజయాల మోత మోగించిన భారత జట్టు.. నేడు వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో కివీస్‌తో నాలుగో టీ20 ఆడనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన... క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు పరువు కాపాడుకునేందుకు తపిస్తోంది.
ర్యాంక్ లక్ష్యమైతే...
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్‌లు గెలిస్తే.. 'మెన్ ఇన్ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.
రోహిత్ చెలరేగితే పక్కా...
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్.. మూడో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అర్ధశతకంతో పాటు సూపర్ ఓవర్లో రెండు సిక్సర్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడు ఫామ్ చూపిస్తే భారత్‌కు విజయం ఖాయమైనట్లే. కేఎల్ రాహుల్, కోహ్లీతో టాప్-3 పటిష్ఠంగా ఉంది. జడేజా ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు.
ముగ్గురు కీపర్ల జట్టుతోనూ..!